కలువరి సిలువ
Kaluvari Siluva
Lyricistకే ఎబినేజర్
UncategorizedAdded on 2/11/2018
Lyrics
కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి|| కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకొన్నావయ్యా వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ అనుక్షణం నీ ఆలోచన నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి|| పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ అనుక్షణం నీ ఆలోచన నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||