కల్వరి ప్రేమను

Kalvari Praemanu

Lyricistఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
UncategorizedAdded on 3/23/2018

Lyrics

కల్వరి ప్రేమను తలంచునప్పుడు
కలుగుచున్నది దుఃఖం
ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు
పగులుచున్నది హృదయం
గెత్సేమనే అను తోటలో
విలపించుచు ప్రార్ధించు ధ్వని
నలువైపులా వినబడుచున్నది
పగులుచున్నవి మా హృదయములు
కలుగుచున్నది దుఃఖం
సిలువపై నలుగ గొట్టిననూ
అనేక నిందలు మోపిననూ
ప్రేమతో వారిని మన్నించుటకై
ప్రార్ధించిన ప్రియ యేసు రాజా
మమ్మును నడిపించుము
||కల్వరి||
మమ్మును నీవలె మార్చుటకై
నీ జీవమును ఇచ్చితివి
నేలమట్టుకు తగ్గించుకొని
సమర్పించితివి కరములను
మమ్మును నడిపిపంచుము
||కల్వరి||

Video