కమనీయమైన

Kamaneeyamaina

Lyricistజాషువా షేక్
UncategorizedAdded on 9/29/2020

Lyrics

కమనీయమైన నీ ప్రేమలోన
నే నిలువనా నా యేసయ్యా
కమనీయమైన నీ ప్రేమలోన
నే నిలువనా నా యేసయ్యా
(తీయ) తీయని నీ పలుకలలోన
నే కరిగిపోనా నా యేసయ్యా
నా హృదిలో కొలువైన నిన్నే
సేవించనా/సేవించెదా నా యేసయ్యా
విస్తారమైన ఘన కీర్తి కన్నా
కోరదగినది నీ నామం
జుంటె తేనె ధారల కన్నా
మధురమైనది నీ నామం
సమర్పణతో నీ సన్నిధిని చేరి
నిత్యము నిన్నే ఆరాధించనా
(2)         ||కమనీయమైన||
వేసారిపోయిన నా బ్రతుకులో
వెలుగైన నిన్నే కొనియాడనా
కన్నీటితో నీ పాదములు కడిగి
మనసారా నిన్నే పూజించనా
నీ కృపలో గతమును వీడి
మరలా నీలో చిగురించనా
(2)         ||కమనీయమైన||

Video