కమ్మని బహుకమ్మని

Kammani Bahukammani

Lyricistజాషువా షేక్
UncategorizedAdded on 7/13/2016

Lyrics

కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని
తెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం
జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం
యేసు నీ ప్రేమామృతం
(2)        ||కమ్మని||
ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితం
యేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము
కడిగిన ముత్యముగా అయ్యాను నేను
(2)        ||కమ్మని||
నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవ
నా గుండె గుడిలో కొలువైయున్న – నీకు చేసెద నేను మధుర సేవ
ఆరాధింతును నిన్ను అనుదినము
జీవింతును నీకై అనుక్షణము
(2)        ||కమ్మని||

Video