కనలేని కనులేలనయ్యా
Kanalaeni Kanulaelanayyaa
Lyricistకనలేని కనులేలనయ్యా
UncategorizedAdded on 8/15/2016
Lyrics
వినలేని చెవులేలనయ్యా నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా ||కనలేని||