కనలేను ప్రభుకేల

Kanalaenu Prabhukaela

UncategorizedAdded on 4/2/2021

Lyrics

కే సుందర్ రావు
కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై
మనలేను ప్రభు జూచి కఠినాత్మునై
కఠినాత్మునై…
||కనలేను||
పాపులనేలేటి ప్రభునేలనో
బల్లెంపు పోటుల బంధించిరి
కనుపించు పాపాలు రక్తాలలో
ప్రభు బాధలో
||కనలేను||
ముండ్ల కిరీటము ప్రభుకేలనో
మూఢులు మోపిరి ప్రభు నెత్తిని
ప్రభు రక్త గాయాలు నా పాపమా
ప్రభు శాపమా
||కనలేను||
తన జంపు శత్రువుల క్షమియించెను
క్షమియింపుమని తండ్రిని వేడెను
క్షమా బుద్ధి నేర్పించి చితి నోర్చెను
భరియించెను
||కనలేను||
మోయజాలని సిలువ మోయించిరి
దివినేలు బాహువులు బంధించిరి
నా పాపమంతయు ప్రభు మోసెను
భరియించెను
||కనలేను||
జీవజలముల నిచ్చుఁ ప్రభుకేలనో
చేదు చిరక త్రాగను అందించిరి
ఆత్మ దాహము తీర్చ బలి అయ్యెను
సిలువొందెను
||కనలేను||
తన ఆత్మ తండ్రికి సమర్పించెను
తనదంతా తండ్రితో చాచుంచెను
తలవంచి తండ్రిలో తుది చేరెను
కను మూసెను
||కనలేను||
లోకాలనేలేటి ప్రభువేలనో
ఈ ఘోర మరణంబు గురి అయ్యెనో
నా పాప బ్రతుకేల ప్రభువేడ్చెనో
సిలువేసెనో
||కనలేను||

Video