కన్నీరే మనిషిని బాధిస్తుంది
Kanneerae Manishini Baadhisthumdi
Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 10/29/2015
Lyrics
కన్నీరే మనిషిని బాధిస్తుంది ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది (2) ||కన్నీరే|| కన్నీరే మరియను బాధించింది ఆ కన్నీరే మరణము గెలిపించింది కన్నీరే కాదనుకుంటే లాజరు తిరిగి బ్రతికేనా కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించేనా (2) ||కన్నీరే|| కన్నీరే హన్నాను బాధించింది ఆ కన్నీరే కుమారుని దయచేసింది కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించేనా కన్నీరే వలదనుకుంటే దేవుని కృపను గాంచేనా (2) ||కన్నీరే||