కన్నుల నిండుగ

Kannula Nimduga

Lyricistఅనిల్ వేముల
UncategorizedAdded on 10/29/2021

Lyrics

కన్నుల నిండుగ – క్రిస్మస్ పండుగ
గుండెల నిండుగ – ఆనందముండుగ
పరమ పురినుండే – పరిశుద్ధ దేవుడు
పుడమిలో పుట్టెగా – పాపుల బ్రోవగ
మహిమలోనుండే – మహిమాత్ముండు
మనుజుడాయెగా – మరణము నొందగా
రండి చేరి కొలిచెదం – రారండి కలసి పాడుదాం
రండి యేసుననుసరించుదాం – పదండి ప్రభుని చూపించుదాం
సర్వసృష్టిని మాటతో చేసిన – సార్వభౌముడా నీకు సముడెవ్వరయ్యా
లోకపాపమంతయూ మోయవచ్చిన – దైవమానవా నీకు స్థలమే లేదయ్యా
చీకటినుండి వెలుగునకు – మరణమునుండి జీవముకు
నడిపింప వచ్చిన నజరేయుని – దాటింప వచ్చిన దయామయుని
ప్రేమించి వచ్చిన ప్రేమామయుని – క్షమియించ వచ్చిన క్షమాపూర్ణుని
||రండి||
విశ్వమంతయూ వ్యాపించియున్న – సర్వవ్యాపి నీవులేని చోటే లేదయ్యా
అంతరంగమంతయూ ఎరిగియున్న – సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా
దాస్యము నుండి స్వాతంత్ర్యమును – శాపము నుండి విడుదలను
ప్రకటింప వచ్చిన పుణ్యాత్ముని – రక్షింప వచ్చిన రక్షకుని
శాంతిచేయ వచ్చిన శాంతమూర్తిని – విడిపింప వచ్చిన విమోచకుని
||రండి||
ఊహకందని త్రియేకమైయున్న – అద్వితీయుడా నీవే ఆత్మరూపివయ్యా
నిన్న నేడు రేపు ఏకరీతిగున్న – నిత్యనివాసి నీకు అంతమే లేదయ్యా
సంకెళ్ళనుండి సంబరానికి – ఉగ్రతనుండి ఉదాత్తతకు
తప్పింప వచ్చిన త్యాగమూర్తిని – కనికరింప వచ్చిన కరుణశీలుని
కృపజూపవచ్చిన కృపాకరుని – దాపుచేరనిచ్చిన దాక్షిణ్యపూర్ణుని
||రండి||

Video