కన్నులనెత్తి పైరుల చూడు
Kannulaneththi Pairula Choodu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 11/21/2015
Lyrics
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా|| మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా|| విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా|| మందిరము పడియుండ మందుడవై నీవుండి సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా|| మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా||