కన్నులుండి చూడలేవ
Kannulumdi Choodalaeva
UncategorizedAdded on 11/5/2015
Lyrics
చెవులుండి వినలేవ యేసు మాటను నాలుకుండి పాడలేవ యేసు పాటను కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి|| చెడును చూడకుండ నీ కనులను చెడును వినకుండ నీ చెవులను చెడును పలుకకుండ నీ నాలుకన్ చెడులో నడువకుండ నీ కాళ్ళను దూరముగా నుంచు ఓ సోదరా దూరముగా నుంచు ఓ సోదరీ (2) ||కన్నులుండి|| దుష్టుల ఆలోచన చొప్పునా నడువక సాగుమా నీ యాత్రలో పాపుల మార్గమందు నీవు నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకుమా ఓ సోదరా కూర్చుండకుమా ఓ సోదరీ (2) ||కన్నులుండి|| యెహోవా దొరుకు కాలమందునా ఆయనను మీరు వెదక రండి ఆయన మీ సమీపమందు నుండగా ఆయననూ మీరు వేడుకొనండి ఆయన తట్టు తిరుగు ఓ సోదరా ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ (2) ||కన్నులుండి||