కనులున్నా కానలేని

Kanulunnaa Kaanalaeni

Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 11/26/2014

Lyrics

కనులున్నా కానలేని చెవులున్నా వినలేని
మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని
వాడను యేసయ్యా
ఓడిపోయిన వాడను
||కనులున్నా||
అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని
దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని
యేసయ్యా నన్ను విడువకయ్యా
దిక్కులేని వాడను
వాడను యేసయ్యా
చెదరిపోయిన గూడును
||కనులున్నా||
భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని
భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని
యేసయ్యా నన్ను కరుణించుమా
ఫలములేని వాడను
వాసిని యేసయ్యా
పేరుకు మాత్రమే విశ్వాసిని
||కనులున్నా||
బోధ ఉన్నా బ్రతుకులేని
పిలుపు ఉన్నా ప్రయాసపడని
సేవ ఉన్నా సాక్ష్యములేని
సంఘము ఉన్నా ఆత్మలులేని
యేసయ్యా నన్ను నింపుమయ్యా
ఆత్మలేని వాడను
పాదిరిని యేసయ్యా
మాదిరి లేని కాపరిని
||కనులున్నా||

Video