కనురెప్ప పాటైన
Kanureppa Paataina
Lyricistగుంటూరు రాజా
UncategorizedAdded on 12/14/2016
Lyrics
కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ పగలూ రేయి పలకరిస్తోంది పరమును విడిచి నను వరియించింది కలవరిస్తోంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప|| ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది ప్రేమ రూపుతో నను మార్చియున్నది ప్రేమను మించిన దైవం లేదని ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తోంది ప్రేమా కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప|| ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు సాటి లేనే లేదని పరవశిస్తోంది ప్రేమా కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||