కరిగే కొడుకు
Karigae Koduku
Lyricistజాస్పర్ కునపో
UncategorizedAdded on 1/29/2024
Lyrics
అన్ని తెలిసిన తల్లి మరియమ్మా నీ వెన్న మనసులో వేదన ఏందమ్మా కరిగే కొడుకును కన్నది నువ్వమ్మా నీ గుండెలో బరువును తీసేదెవరమ్మా మది సిలువలో తనయుని పలుమార్లు తలచి నిలువెల్ల వణికి నిదురంత పోయేనా.. పుట్టినరోజులు పండుగలేవమ్మా ఈ కారణజన్ముడు కరుణామయుడమ్మా గట్టిగ పట్టిన ఆపగ లేవమ్మా గొల్గొతా గమనం తప్పదు ఓయమ్మ అది మనకోసమేనమ్మా… ||అన్ని తెలిసిన|| గొల్లలంతా కలిసి మెల మెల్లగ చేరిరి తమ పిల్లన గ్రోవితో లాలిపాటను పాడిరి తూరుపు దేశపు జ్ఞానుల మంటిరి నింగి చుక్కను కనుగొని బహు చక్కగా చేరిరి బంగారం సాంబ్రాణి అర్పించి రారాజు యాజకుడు అని యెంచి మొకరించి బహుమతులిచ్చి ఆ మహిమంతా మనసుకు తెలిపి బోళము నెందుకు తెచ్చిరి ఓ యమ్మ ఆ మరణపు సూచిక కంటివా మరియమ్మా బోరున వచ్చిన కన్నీరేదమ్మా నీ గుండెను గుచ్చిన తరుణం కదా అమ్మా అది మనకోసమేనమ్మా… ||అన్ని తెలిసిన|| ఎనిమిదో దినమున యెరూషలేము వచ్చి పేరు యేసు అని పెట్టి ఎంతగానో మురిసిరి సిమోయోను వచ్చెను ఆ శిశువును చూసేను మహా సంబరపడుచు బహు నెమ్మది నొందెను తన ఆత్మ నింపబడి ఎత్తుకుని – మన లోక రక్షణ కై ముద్దాడి తన తనువు చాలింప తృప్తిపడి – ఆ మహిమంతా జనులకు తెలిపి నీ హృదయములో ఖడ్గము దూరునని ఆ సిలువలో త్యాగం నీకు నేర్పేనమ్మా దీవెన నొందిన ధన్యత నీదమ్మా ఆ మరణము గెలిచిన తనయుని తల్లివమ్మా అది మనకోసమేనమ్మా… ||అన్ని తెలిసిన||