కరుణ చూపించుమా
Karuna Choopimchumaa
Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 4/24/2020
Lyrics
కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము కరుణగల దేవుడు నీవు కరుణించి కాపాడుమా ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము నీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము (2) ||కరుణగల|| ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించాము నీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళ మాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి (2) ||కరుణగల|| మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావు నిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్న వాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య (2) ||కరుణగల||