కరుణామయుడా పరలోక రాజా

Karunaamayudaa Paraloka Raajaa

UncategorizedAdded on 8/8/2018

Lyrics

కరుణామయుడా పరలోక రాజా
నిత్యనివాసి నిర్మల హృదయుడా
నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు
||కరుణామయుడా||
గడిచిన దినములన్ని కాపాడినావు
కృపాక్షేమములే నా వెంట ఉంచావు
విడువక నా యెడల కృప చూపినావు
విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ
(2)          ||నీకే స్తోత్రములు||
శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా
వేదనలెన్నో కలిగిన వేళలో
సహించే శక్తి నాకిచ్చినావు
నీ సేవలో నన్ను నడిపించినావు
(2)          ||నీకే స్తోత్రములు||
నూతన యుగములోన నను నిలిపినావు
నూతనాత్మతో నను నింపు దేవా
నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి
ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త
(2)          ||నీకే స్తోత్రములు||