కరుణించవా నా యేసువా

Karunimchavaa Naa Yaesuvaa

UncategorizedAdded on 9/14/2017

Lyrics

కరుణించవా నా యేసువా
ఓదార్చవా నజరేతువా
నీ కృపలో అనుదినము రక్షించవా
నీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా
(2)       ||కరుణించవా||
నిరాశ నిస్పృహలతో కృంగిన వేళ
బలమైన శోధన నను తరిమిన వేళ
మిత్రులే శత్రువులై దూషించిన వేళ
లోకమే విరోధమై బాధించిన వేళ
(2)       ||కరుణించవా||
ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ
నీ సిలువ పయనంలో అలసిపోవు వేళ
సాతాను పోరాటమే అధికమైన వేళ
విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ
(2)       ||కరుణించవా||

Video