కరుణించి తిరిగి సమకూర్చు
Karunimchi Thirigi Samakoorchu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 2/23/2022
Lyrics
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను దావీదు రాజు దీనుడై వేడ అవనిలో బొందిన నష్టములన్నియు దేవా నీవు సమకూర్చితివే (2) ||కరుణించి|| శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నష్టపడితిని మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి (2) ||కరుణించి|| పసరు గొంగళి – చీడ పురుగులు నాశనము చేసిన పంటను కూర్చుమా యేసు ప్రభూ నిన్ను వేడుచున్నాను (2) ||కరుణించి|| ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని ప్రేమతో నీవు సమకూర్చుమా (2) ||కరుణించి|| పాపపు విషముతో నా పాత్ర నిండెను ప్రభు యేసుండను పిండిని కలుపుము పాప మరణమును తొలగించుమా (2) ||కరుణించి|| ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మ నష్టముల నెన్నియో బొందితి ఆత్మ దేవా నీవు సమకూర్చుమా (2) ||కరుణించి|| పాపము చేసి పడియున్న చోటున్ ప్రాపుగా నీవు జూపుమో ప్రభువా కోపగించక నాపై కృప జూపుమా (2) ||కరుణించి|| చేసిన పాపము కప్పుకొనక విశ్వాసముతో ఒప్పుకొందున్ సిలువ రక్తముతో శుద్ధి చేయుమా (2) ||కరుణించి||