కరుణించుము మము పరమ పితా

Karunimchumu Mamu Parama Pithaa

UncategorizedAdded on 8/9/2017

Lyrics

శరణం నీవే ప్రభు యేసా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవా
పరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా
||హల్లెలూయా||
రాత్రిలో కలుగు భయమేమి – రాకుండ జేయుచుండెదవు
రాత్రిలో నీ హస్తముతో – రయముగ కప్పుము ప్రియ తండ్రి
||హల్లెలూయా||
రథమును గుఱ్ఱము రౌతులను – రాత్రిలో చుట్టిరి సిరియనులు
రథమును అగ్ని గుఱ్ఱములన్ – రక్షణగా ఉంచిన దేవా
||హల్లెలూయా||
అర్ధ రాత్రిలో యాకోబు – అడవిలో నిద్రించిన గాని
ప్రార్ధన చేయుట నేర్పితివి – పరలోక ద్వారము చూపితివి
||హల్లెలూయా||