కష్ట నష్టాలైనా
Kashta Nashtaalainaa
UncategorizedAdded on 8/9/2017
Lyrics
ఎన్ అషెర్ బుషన్న కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే ఓ యేసయ్యా… ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా యేసయ్య మార్గమే నడవర ఓరన్న ||కష్ట|| కొండగా అండగా – నీవుండగ లోకాన ఎండిన ఎముకలయినా – ఉండుగా జీవంగా యేసయ్య మార్గమే నడవర ఓరన్న ||కష్ట|| కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను ||కష్ట||