కవులకైనా సాధ్యమా

Kavulakainaa Saadhyamaa

Lyricistజాన్ వెస్లీ
UncategorizedAdded on 1/11/2016

Lyrics

కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం
ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం
శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం
రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం
(2) ||కవులకైనా||
చెదరిన మనసులకూ శాంతి
కృంగిన హృదికీ ఓదార్పు
మృత్యు దేహముకూ జీవం
బలహీనులకు ఆరోగ్యం
పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు
గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు
మోసపూరిత ఈ లోకంలో
ఏ వైద్యునికి సాధ్యము
(2)           ||కవులకైనా||
క్షణికమైన అనురాగాలు
ఆవిరివంటి ఆప్యాయతలు
అవసరాల అభిమానాలు
నిలచిపోయే అనుబంధాలు
నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ
ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం
స్వార్ధపూరిత ఈ లోకంలో
ఏ మిత్రునికి సాధ్యము
(2)          ||కవులకైనా||

Video