కంట నీరేల

Kmta Neeraela

Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 6/17/2017

Lyrics

కంట నీరేల? కలతలు ఏల?
యేసుతో నీవు సాగు వేళ
శోధన వేళ రోదన ఏల?
నీ విశ్వసము గెలిచే వేళ
నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు
నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు
||కంట||
వలదు చింతన దేనికైనా
విన్నవించుము నీ నివేదన
పొందితినను నీదు నమ్మకము
దరికి చేర్చును తగిన విజయము
తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు
పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు
రేపు గూర్చిన భయము వలదు
ప్రతి దినము తగు బాధ కలదు
నీదు భారము మోయు ఆ దేవుడు
నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు
నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం
స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం

Video