కొండ కోన లోయలోతుల్లో
Komda Kona Loyalothullo
Lyricistప్రభు భూషణ్
UncategorizedAdded on 1/5/2016
Lyrics
కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ వినబడుతుంది నా యేసుని స్వరమే తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన || నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు హృదయమందు చేర్చుకో నేస్తమా ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన || ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు నిన్ను రక్షించాలని కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన ||