కొండల తట్టు
Komdala Thattu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/5/2018
Lyrics
కొండల తట్టు కన్నులెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును భూమి యాకాశముల సృజించిన యెహోవా వలన సాయము కల్గున్ ||కొండల|| నీ పాదము తొట్రిల్ల నీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ||కొండల|| ఇశ్రాయేలును కాచు దేవుడు కునుకడు నిద్రపోడు యెన్నడు ||కొండల|| యెహోవాయే నిన్ను కాపాడును కుడి ప్రక్క నీడగా నుండును ||కొండల|| పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులకుండ కాపాడును ||కొండల|| ఎట్టి అపాయమైన రాకుండ ఆయన నీ ప్రాణము కాపాడున్ ||కొండల|| ఇది మొదలుకొని నిత్యము నీ రాకపోకలందు నిను కాపాడున్ ||కొండల||