కొండల తట్టు నా కన్నులు

Komdala Thattu Naa Kannulu

UncategorizedAdded on 10/19/2021

Lyrics

నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును
యెహోవా వలనే – యెహోవా వలనే
నాకు సహాయం కలుగును – కలుగును
కలుగును
భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా
నా పాదంబులను – తొట్రిల్లనీయడు
నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు
యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును
(2)         ||యెహోవా||
నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును
పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక
ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును
నా రాకపోకలయందును – కాపాడి రక్షించును
(2)         ||యెహోవా||
వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా
నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా
నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా
నా కుడిప్రక్క పదివేలు కూలిననూ – నీ కృపచేత కాపాడుమా
(2)         ||యెహోవా||

Video