కొంత యెడము నీవైనా

Komtha Yedamu Neevainaa

Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 3/17/2021

Lyrics

కొంత యెడము నీవైనా నే సాగలేను
నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను
కొంత యెడము నీవైనా
మరచిన వేళలో మది నీ పలుకులు
సడలి కట్టడలు మలినము తలపులు
ప్రేమను పంచే ప్రేమ రూపుడా
మరియొక్క మారు మన్నించు విభుడా
(2)         ||కొంత యెడము||
కనులకు మోహము కమ్మిన క్షణము
వినుట మరచె నీ స్వరమును హృదయము
కమ్మిన పొరలు కరిగించుటకు
నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు
(2)         ||కొంత యెడము||
మదము, మత్సరములు సోకిన తరుణము
పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము
నిరతము స్థిరముగ నున్న అక్షయుడా
నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా
(2)         ||కొంత యెడము||
మనుజ రూపమున మహిలో నిలిచి
మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి
నను వరియించగ రానున్న ప్రియుడా
నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా
(2)         ||కొంత యెడము||

Video