కొంతసేపు కనబడి
Komthasaepu Kanabadi
Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 2/28/2017
Lyrics
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు (2) ||కొంతసేపు|| ఎదురౌతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరు నీ అక్కరలో వచ్చేదెవరు నీతో మరణము వరకు ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు ||యేసే|| చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా ||యేసే|| నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతినీయగ నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా ||యేసే||