కొనియాడ తరమే నిన్ను
Koniyaada Tharamae Ninnu
Lyricistపంతగాని పరదేశి
UncategorizedAdded on 9/16/2017
Lyrics
కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను తనరారు దినకరు – బెను తారలను మించు ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ|| కెరుబులు సెరుపులు – మరి దూత గణములు నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ|| సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొనియాడ|| విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు ||కొనియాడ|| దోసంబులను మడియు – దాసాళి కరుణించి యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు ||కొనియాడ|| నరులయందున కరుణ – ధర సమాధానంబు చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు ||కొనియాడ|| ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత ||కొనియాడ||