కూర్చుందును నీ సన్నిధిలో

Koorchumdunu Nee Sannidhilo

Lyricistజోసఫ్ కొండా
UncategorizedAdded on 8/15/2016

Lyrics

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను
||కూర్చుందును||
ప్రతి విషయం నీకర్పించెదా
నీ చిత్తముకై నే వేచెదా
నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా
నీ నామమునే హెచ్చించెదా
నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
యేసూ యేసూ యేసూ యేసూ..
||కూర్చుందును||
ప్రతి దినము నీ ముఖ కాంతితో
నా హృదయ దీపం వెలిగించెదా
నీ వాక్యానుసారము జీవించెదా
నీ ఘన కీర్తిని వివరించెదా
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
యేసూ యేసూ యేసూ యేసూ..
||కూర్చుందును||

Video