కోటి కాంతుల వెలుగులతో
Koti Kaamthula Velugulatho
Lyricistబాపు కొండేటి
UncategorizedAdded on 5/24/2020
Lyrics
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2) ||కోటి కాంతుల|| రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – (2) ||కోటి కాంతుల|| మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే – (2) ||కోటి కాంతుల||