క్రైస్తవ జీవితం

Kraisthava Jeevithm

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/10/2018

Lyrics

క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం
కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా
యేసు ప్రభువే నా సహకారి
(2)          ||క్రైస్తవ||
ఈ లోక ఘనత నన్ను విడిచినన్
లోకస్థులెల్లరు నన్ను విడిచినన్
నా సహోదరులు నన్ను విడిచినన్
యోసేపు దేవుడే నా సహకారి
(2)          ||క్రైస్తవ||
అంధకారంబు భువి నావరించిన
రాజులు ఘనులు శత్రువులైనను
అగ్ని గుండములో సింహపు బోనులో
దానియేలు దేవుడే నా సహకారి
(2)          ||క్రైస్తవ||
నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు
శాశ్వత రాజు నా సహాయకుడు
భారం నాకెందుకు వ్యాకులమెందుకు
ప్రభు ప్రజలతో నే కీర్తించెదన్
(2)          ||క్రైస్తవ||
బూర శబ్దంబు మ్రోగెడి వేళ
శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్
ఏనాడు ఎప్పుడు నీవు వచ్చెదవు
ఆనాటి వరకు నే కనిపెట్టెదన్
(2)          ||క్రైస్తవ||

Video