క్రైస్తవుడా సైనికుడా
Kraisthavudaa Sainikudaa
Lyricistకే రాజబాబు
UncategorizedAdded on 6/8/2017
Lyrics
క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా జాలరీ మనుషులు పట్టు జాలరి ఆత్మలు పట్టు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి ||క్రైస్తవుడా|| సిలువే నీ స్థావరము శ్రమలే నీ సైన్యము సహనమే నీ ధైర్యము వాక్యమే నీ విజయము (2) ||క్రైస్తవుడా|| సత్యమే నీ గమ్యము సమర్పణే నీ శీలము యేసే నీ కార్యక్రమం ప్రేమే నీ పరాక్రమం (2) ||క్రైస్తవుడా|| దేశంలో విదేశంలో గ్రామంలో కుగ్రామంలో అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో (2) ||క్రైస్తవుడా|| సిద్ధాంతపు గట్టు దుమికి రా వాగులనే మెట్టును దిగిరా దీనుడా ధన్యుడా విజేయుడా అజేయుడా (2) ||క్రైస్తవుడా|| వాగ్ధాన భూమి స్వతంత్రించుకో అద్వానపు అడవి దాటి ముందుకుపో నీ ఇల్లు పెనూయేలు నీ పేరే ఇశ్రాయేలు (2) ||క్రైస్తవుడా||