క్రీస్తేసు ప్రభువు
Kreesthaesu Prabhuvu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 7/11/2020
Lyrics
క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకము వారిది (2) ||క్రీస్తేసు|| అపొస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు సంఘములో నిలిచెదరు (2) ||క్రీస్తేసు|| పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువు నందు (2) ||క్రీస్తేసు|| ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే తన యందు నిలిచెదరు ప్రకటించెదరు ఆయన మరణ పునరుత్తానమును వారు (2) ||క్రీస్తేసు|| పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్ధించెదరో ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు బంధించెదరు వారే (2) ||క్రీస్తేసు|| క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వ లోకము నందు (2) ||క్రీస్తేసు||