క్రీస్తేసు పుట్టెను
Kreesthaesu Puttenu
UncategorizedAdded on 12/5/2020
Lyrics
పశులపాక పావనమై.. పరవశించెనుగా… పరవశించెనుగా… క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగా పశులపాక పావనమై పరవశించెనుగా గొర్రెల కాపరులు సంతోషముతో గంతులు వేసెను ఆనందముతో తూర్పు దిక్కున చుక్క వెలిసెను లోక రక్షకుడు భువికి వచ్చెను (2) ||క్రీస్తేసు|| హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెను చీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించే ఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి (2) ||తూర్పు దిక్కున|| సంతోషము సమాధానము కృపా కనికరము మన జీవితములో ప్రవేశించెను బహుదీవెనకరము సంబరాలతో సంతోషాలతో వేడుకొన రారండి బంగారము సాంబ్రాణి బోళము సమర్పించ రారండి (2) ||తూర్పు దిక్కున||