క్రీస్తు పుట్టెను హల్లెలూయా

Kreesthu Puttenu Hallelooyaa

Lyricistజ్యోతి రాజు
UncategorizedAdded on 11/29/2023

Lyrics

క్రీస్తు పుట్టెను హల్లెలూయా
జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను
చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె
నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో…
ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే
చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య
పాప శాపముతో నిండియుండగా
యేసు అడుగు పెట్టెను
ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను
(2)         ||చీకు చింత||
గెరాసేను జనములలో కొందరు
రోగాలు దయ్యాలతో బాధనొందగా
యేసు అడుగుపెట్టెను
ఆ ఊరిలో – విడుదలకాంతులే ప్రకాశించెను
(2)         ||చీకు చింత||
మరణమాయె యాయీరు కూతురు
వేదన రోదన కన్నీటిలో
యేసు అడుగుపెట్టెను
ఆ ఇంటిలో – జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను
(2)         ||చీకు చింత||
వేదనతో నలిగిపోవుచున్నావా
యేసు నీ కొరకై ఉదయించెను
లెమ్ము తేజరిల్లుమ్ము
నీ ఇంటికి – వెలుగు వచ్చియున్నది
(2)          ||క్రీస్తు పుట్టెను||

Video

Kreesthu Puttenu Hallelooyaa Lyrics | Shining Christians