క్రీస్తుని స్వరము విందును

Kreesthuni Svaramu Vimdunu

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 10/30/2024

Lyrics

క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు
మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది –
యెహోవా నీ స్వరము జలములపై వినబడెను
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను
(2)           ||క్రీస్తుని||
బలమైన నీ స్వరము బహుప్రభావము గలది
దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని
(2)           ||క్రీస్తుని||
అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును
ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును
(2)           ||క్రీస్తుని||
ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్
ఆశీర్వాదము శాంతి నొసగునాయన స్వరమే
(2)           ||క్రీస్తుని||
నీ మధుర స్వరము నీ వాక్యమును విందున్
ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు
(2)           ||క్రీస్తుని||
నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను
(2)           ||క్రీస్తుని||
నీ మధుర స్వరము నీ మార్గము జూపును
కుడి యెడమల తిరిగిన నీ స్వరమే వినబడును
(2)           ||క్రీస్తుని||
తుఫానులు కలిగి భయభీతులలో నుండ
భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము
(2)           ||క్రీస్తుని||
మరణాంధకార లోయలో నేనుండ
నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్
(2)           ||క్రీస్తుని||
ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్
దీనుడనై నీ మాట అంగీకరించెదను
(2)           ||క్రీస్తుని||

Video