క్రిస్మస్ మెడ్లీ 3
Krismas Medlee 3
UncategorizedAdded on 12/12/2022
Lyrics
ఆ ప్రభుండు పుట్టెను – బేత్లెహేము నందున ఓ బేత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు నీవొంద గాఢనిద్రపై – వెలుంగు తారలు ఓ సద్భక్తులారా! లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్ శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను నమస్కరింప రండి నమస్కరింప రండి నమస్కరింప రండి యుత్సాహముతో ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములలో తమ మందలను కాయుచునున్నప్పుడు భూనివాసులందరు – మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్మువారికి – ఆత్మ శుద్ధి కల్గును జ్ఞానులారా మానుడింక యోచనలన్ జేయుట మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్ సద్దేమి లేక వచ్చెగా! ఈ వింత దానము ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి రండి నేడు పుట్టినట్టి రాజునారాధించుడి నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము యేసు పుట్టగానే వింత – ఏమి జరిగెరా దూతలెగసి వచ్చెరా – నేడు లోక రక్షకుండు – పుట్టినాడురా ఈ పుడమి యందున – పశువుల పాకలో పచ్చగడ్డి పరుపులో – పవళించెను… పవళించెను… పవళించెను నాథుడు మన పాలిట రక్షకుడు – దూతల గీతాల మోత విను బేతలేమా పరమ దూతల గీతాల మోత విను బేతలేమా ఎన్నెన్నో యేడుల నుండి నిరీక్షించినట్టి – పరమ దూతల గీతాల మోత విను బేతలేమా –