క్రొత్త యేడు మొదలు బెట్టెను
Kroththa Yaedu Modalu Bettenu
Lyricistఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
UncategorizedAdded on 11/12/2014
Lyrics
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు క్రొత్త యేడు మొదలు బెట్టెను క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ ||క్రొత్త|| పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర డెందమందు స్మరణ జేయుడి ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా ||క్రొత్త|| బలము లేని వారమయ్యీను బలమొందవచ్చు కలిమి మీర గర్త వాక్కున అలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొంది బలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ ||క్రొత్త|| పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు జేరి మీరు వేడగా సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు ||క్రొత్త||