కృపామయుడా

Krupaamayudaa

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 4/16/2016

Lyrics

కృపామయుడా – నీలోనా
నివసింప జేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా…
ఏ అపాయము నా గుడారము
సమీపించనీయక
నా మార్గములన్నిటిలో
నీవే ఆశ్రయమైనందున
(2)         ||కృపామయుడా||
చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయా
రాజవంశములో
యాజకత్వము చేసెదను
(2)       ||కృపామయుడా||
నీలో నిలిచి ఆత్మ ఫలము
ఫలియించుట కొరకు
నా పైన నిండుగా
ఆత్మ వర్షము కుమ్మరించు
(2)      ||కృపామయుడా||
ఏ యోగ్యత లేని నాకు
జీవ కిరీటమిచ్చుటకు
నీ కృప నను వీడక
శాశ్వత కృపగా మారెను
(2)      ||కృపామయుడా||

Video