కృపగల దేవా
Krupagala Daevaa
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 4/1/2021
Lyrics
కృపగల దేవా దయగల రాజా కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహు ఘనతేగా నీ చరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని (2) సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివి అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా (2) ||కృపగల|| త్రోవను చూపే తారవు నీవే గమ్యము చేర్చే సారథి నీవే జీవన యాత్రా శుభప్రదమాయే నా ప్రతి ప్రార్థన పరిమళమాయె నీ ఉదయకాంతిలో నను నడుపుము నా హృదిని నీ శాంతితో నింపుము (2) ||కృపగల|| కృప చూపి నన్ను అభిషేకించి వాగ్ధానములు నెరవేర్చినావే బహు వింతగా నను ప్రేమించినావే బలమైన జనముగా నను మార్చినావే నీ కీర్తి జగమంత వివరింతును నీ దివ్య మహిమలను ప్రకటింతును (2) ||కృపగల|| నా యేసురాజా వరుడైన దేవా మేఘాల మీద దిగి వచ్చు వేళ ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో ప్రియమైన సంఘమై నిను చేరెదను నిలిచెదను నీతోనే సీయోనులో జీవింతు నీలోనే యుగయుగములు (2) ||కృపగల||