కృపలను తలంచుచు

Krupalanu Thalmchuchu

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 8/31/2017

Lyrics

కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్
(2)       ||కృపలను||
మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను (2)
ముట్టునని సెలవిచ్చిన దేవుడు
కాచెను గతకాలం – (నన్ను)
(2)       ||కృపలను||
కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం – (యేసు)
(2)      ||కృపలను||
రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం – (ప్రభువు)
(2)       ||కృపలను||
సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను – (ఇలలో)
(2)       ||కృపలను||
హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే
సీయోను నివాసం నాకెంతో ఆనందం
ఆనందమానందమే – (ఆమెన్)
(2)       ||కృపలను||

Video