కృతజ్ఞతన్ తలవంచి

Kruthajnyathan Thalavmchi

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/1/2016

Lyrics

కృతజ్ఞతన్ తలవంచి
నాదు జీవము అర్పింతును
లేదే ఇక-నే ఈవి ఇల
అర్పింతును నన్నే నీకు
దూరమైతి నీ ప్రేమ మరచి
నే రేపితి నీ గాయముల్
దూరముగా నిక వెళ్ళజాల
కూర్చుండెద నీ చెంతనే
(2)       ||కృతజ్ఞతన్||
ఆకర్షించే లోకాశాలన్ని
లోక మహిమ నడ్డగించు
కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై
నిక్కముగా త్యజింతును
(2)       ||కృతజ్ఞతన్||
తరముల నీ ప్రేమ నాకై
వర్ణింపను అశక్యము
నిరంతరము సేవించినను
తీర్చలేను నీ ఋణము
(2)      ||కృతజ్ఞతన్||

Video