క్షణమైన గడవదు

Kshanamaina Gadavadu

Lyricistజాషువా గరికి
UncategorizedAdded on 6/10/2017

Lyrics

క్షణమైన గడవదు తండ్రి
నీ కృప లేకుండా –
ఏ ప్రాణం నిలువదు ప్రభువా
నీ దయ లేకుండా –
నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానం
నీవే నా సర్వం – యేసు
(2)       ||క్షణమైన||
ఇంత కాలం లోకంలో బ్రతికా
జీవితం అంతా వ్యర్థం చేసా
తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని
అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని
పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా
ఎక్కడ ఉన్నా నేనేమై యున్నా
నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా
నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా
జ్ఞానమున్నా పదవులెన్నున్నా
ధనము ఉన్నా సర్వం నాకున్నా
నీవు నాతో లేకుంటే అంతా శూన్యమేగా
పరలోక స్వాస్థ్యం ఎల్లప్పుడు శ్రేష్ఠమేగా

Video