లాలి లాలి జోలాలి

Laali Laali Jolaali

Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 11/23/2019

Lyrics

లాలి లాలి జోలాలి – బాల యేసునకు లాలి
కన్య మరియా తనయునకు – పాడ రండి జోలాలి
లోక రక్షకునకు లాలి – శాంతి కర్తకు జోలాలి
మాదు తండ్రికి మా లాలి
చీకటి దొంతరల తెరలకు – తెరను దింపగా వచ్చినావని
పాప శాపపు తాపములకు – రక్షణను ఇల తెచ్చినావని
మానవుల మోచకుడా లాలి – ధరణిఁ పై దైవమా జోలాలి
మాదు తండ్రికి మా లాలి
దారి తెలియని మానవాళికి – దారి నీవై వెలసినావని
మరణ ఛాయలు రూపుమాపగ – జీవ కిరణమై మెరిసినావని
సత్య రూపునకు లాలి – నీతి సూర్యునకు జోలాలి
మాదు తండ్రికి మా లాలి

Video