లెక్కించలేని స్తోత్రముల్
Lekkimchalaeni Sthothramul
Lyricistసరోజిని ప్రకాష్
UncategorizedAdded on 11/5/2013
Lyrics
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును భూమిలో కనబడునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్ని దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు ఆకాశమున ఎగురునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||