లెమ్ము తేజరిల్లుము నీకు
Lemmu Thaejarillumu Neeku
UncategorizedAdded on 9/19/2017
Lyrics
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది యెహోవా మహిమ నీపై ప్రకాశముగా నుదయించె (2) ||లెమ్ము|| యేసే యీ లోకమునకు వెలుగై యున్నానని చెప్పెన్ యేసుని నమ్మువారు వెలుగులో నడుచువారు (2) ||లెమ్ము|| అంధకార మందుండి బంధింప బడిన వారిన్ ఆశ్చర్యమైన వెలుగు నందించి విమోచించెన్ (2) ||లెమ్ము|| దాత ప్రభు యేసుని నమ్మి నీతిగా నడుచువారు జాతి భేదములు లేక జ్యోతుల వలె నుందురు (2) ||లెమ్ము|| మనుజులు మీ సత్క్రియలను జూచి బహు సంతోషించి మనసారా పరమ తండ్రిన్ మహిమ పరచెదరు (2) ||లెమ్ము|| జనములు నీ వెలుగునకు పరుగెత్తి వచ్చెదరు రాజులు నీదు ఉదయ కాంతికి వచ్చెదరు (2) ||లెమ్ము||