లోకమును విడచి

Lokamunu Vidachi

UncategorizedAdded on 1/5/2018

Lyrics

లోకమును విడచి వెళ్ళవలెనుగా
సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్
||లోకమును||
యాత్రికులము ఈ దుష్ట లోకములో
పాడు లోకములో మనకేది లేదు
ఏ విషయమందైన గర్వించలేము
గర్వించలేము
జాగ్రత్తగానే నడచుకొనెదము
(2)      ||లోకమును||
మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి
నిజ ప్రేమతోనే జీవించెదాము
నిష్కళంకులమై శుద్ధులమై
శుద్ధులమై
పరిపూర్ణతను చేపట్టుదాము
(2)      ||లోకమును||
ఆత్మీయ నేత్రాలతో చూచెదాము
ఎంతా అద్భుతమో సౌందర్య నగరం
ప్రభువు చెంతకు వెళ్ళెదము
వెళ్ళెదము
విజయోత్సవముతో ప్రవేశించెదము
(2)      ||లోకమును||

Video