మా గొప్ప దేవా

Maa Goppa Daevaa

Lyricistపవన్ కుమార్
UncategorizedAdded on 1/9/2017

Lyrics

మా గొప్ప దేవా – మము కరుణించి
అత్యున్నత స్థానములో నను నిలిపావు
యోగ్యుడనే కాను ఆ ప్రేమకు
వెల కట్టలేను ఆ ప్రేమకు
ఆరాధించెదను… నా పూర్ణ హృదయముతో
నిన్నే కీర్తింతును – నా జీవితమంతా
నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలో
చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు
పాపంలో నుండి నను విమోచించుటకు
ఆ ఘోర సిలువలోన మరణించావు
దాస్యములోనుండి పడి ఉన్న నన్ను
నీ కుమారునిగా రక్షించావు
||మా గొప్ప||
మార్పులేని బ్రతుకులో మలినమైన మనస్సుతో
నే తూలనాడి దూషించింది నిన్నేనేగా
ఆ స్థితిలో కూడా నను ప్రేమించే గొప్ప
హృదయం నీదే యేసయ్యా
నాలాంటి ఘోరమైన పాపిని కూడా
క్షమియించి ప్రేమించింది నీవేనయ్యా
||మా గొప్ప||

Video