మా ఊహలు పుట్టక మునుపే

Maa Oohalu Puttaka Munupae

UncategorizedAdded on 10/5/2016

Lyrics

ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా
విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో
పొందెదము ఎన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో
(2)          ||మా ఊహలు||
నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి
నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా
పలు సమయముల యందు – పలు వరముల నిచ్చితివి
అడుగనేల ప్రభువా ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు
||మా ఊహలు||
ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చమని
నిన్నడుగుచున్నాము నీ – రాజ్యములో చోటిమ్మని
ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవా
ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడే చాలు
||మా ఊహలు||

Video