మా సర్వానిధి నీవయ్యా

Maa Sarvaanidhi Neevayyaa

UncategorizedAdded on 8/2/2017

Lyrics

మా సర్వానిధి నీవయ్యా
నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా…
మా ప్రియమైన యేసయ్యా
(2)        ||మా సర్వానిధి||
మా పాపములకై కలువరి గిరిపై
నలిగితివా మా ప్రియ యేసయ్యా
విరిగి నలిగిన హృదయాలతో
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
||యేసయ్యా||
నీవే మార్గము – నీవే సత్యము
నీవే జీవము – మా యేసయ్యా
జీవపు దాత శ్రీ యేసునాథ
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
||యేసయ్యా||
మా స్నేహితుడవు – మా రక్షకుడవు
పరిశుద్ధుడవు – మా యేసయ్యా
పరిశుద్ధమైన నీ నామమునే
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
||యేసయ్యా||

Video