మాధుర్యమే నా ప్రభుతో

Maadhuryamae Naa Prabhutho

UncategorizedAdded on 6/13/2018

Lyrics

మహిమానందమే – మహా ఆశ్చర్యమే
||మాధుర్యమే||
సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు
వారి అందమంతయు పువ్వు వలె
వాడిపోవును – వాడిపోవును
||మాధుర్యమే||
నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే
దేవుని యందలి భయ భక్తులతో
ఉండుటే మేలు – ఉండుటే మేలు
||మాధుర్యమే||
నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే
నా రోగమంతయు సిలువలో
పరిహరించెను – పరిహరించెను
||మాధుర్యమే||
వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను
తేజోవాసులైన పరిశుద్ధులతో
ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో
||మాధుర్యమే||

Video